పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కొత్త కెరండీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం వార్షి కోత్సవాన్ని విద్యా కమిటీ అధ్యక్షుడు లింగరాజ్ మిశ్రా ప్రారంభించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముంగి రవికుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా గుసాని సమితి విద్యాశాఖ అధికారి సీతారంపాత్రో, ఉప విద్యాశాఖ అధికారి కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ వక్తృత్వ, డ్రాయింగ్, ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు ముఖ్యఅతిథి సీతారాం పోత్రో, లింగరాజ్ మిశ్రా చేతులమీదుగా మెమొంటోలు, బహుమతులను అందజేశా రు. అనంతరం విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సి.ఆర్.సి.సి. సి.హెచ్.గౌరీ, గుమ్మా బ్లాక్ ఉపాధ్యాయు లు అమూల్య పాణిగ్రాహి, పర్లాకిమిడి గాంధీ మెమోరియల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం.తిరుపతిరావు, విద్యాకమిటీ ఉపాధ్యక్షులు జయక్రిష్ణ జెన్నా పాల్గొన్నారు.
కొత్త కెరండీ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం
కొత్త కెరండీ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం