
హాల్‌మార్క్‌ను నమ్మకూడదా..?
నరసన్నపేటలో వెలుగు చూసిన మోసంతో బంగారం ఆభరణాలపై హాల్‌మార్క్ ఉన్నా నమ్మడానికి లేదని స్పష్టమవుతోంది. ఆ హాల్ మార్క్ ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి మరో కేంద్రం వద్ద టెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా హాల్‌మార్క్ ఉంటే బంగారానికి తిరుగులేదు అనుకుంటారు. ప్యూరిటీ ఉన్న బంగారంగా భావిస్తారు. నకిలీ టెస్టింగ్ అండ్ హాల్ మార్క్ సెంటర్ల ఏర్పాటుతో ఏది సరైన హాల్ మార్క్, ఏది నకిలీ అని తెలుసుకోలేని పరిస్థితులు ఉండటంతో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.