విడిది ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

విడిది ఏదీ..?

Jul 19 2025 4:18 AM | Updated on Jul 19 2025 4:20 AM

ఇచ్ఛాపురం రూరల్‌:

వేల కిలోమీటర్ల నుంచి అతిథి పక్షులు తేలుకుంచి చేరిపోయాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన కూతలతో చెట్లపై ముసురుకుంటున్నాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌ మాసాంతరానికి వచ్చే పక్షులు ఈ ఏడాది కూడా ఏతెంచాయి.

కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు

చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు గ్రామం చుట్టూ ఉన్న చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడు తుంటాయి. సుమారు 27 నుంచి 30 రోజుల వర కు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి పిల్ల పక్షులను సంరక్షిస్తాయి. పిల్ల పక్షులకు శక్తి వచ్చి ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి.

స్థానికులతో అనుబంధం

ఎక్కడో సైబీరియా నుంచి ఇక్కడి వరకు వచ్చే పక్షులకు అసలైన బంధువులంటే ఈ గ్రామ వాసులే. ఈ గ్రామస్తులతో పక్షులకు విడదీయలేని అనుబంధం ఉంది. పక్షుల రాక ఏ మాత్రం ఆలస్యమైనా కంగారుపడిపోతారు. ఇవి వస్తేనే వానలు కురుస్తా యని ఇక్కడి వారి నమ్మకం. తాము కూర్చున్న చోట, పక్కనే వాలుతాయని, వీటిని వేటగాళ్ల బారినుంచి గ్రామస్తులమే రక్షిస్తుంటామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇవే ప్రత్యేకతలు

● వీటి అసలు పేరు ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌. వీటి శాసీ్త్రయ నామం ‘అనస్థోమస్‌’. ● ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూ ర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి.

● వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు.

● బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.

● దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ అని అంటారు. ● పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి.

సంరక్షణ గాలి..

పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో చెట్లు పెంచాల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ఏడాదికో మారు గ్రామంలో చిన్నపాటి సమావేశాలు పెట్టి ఫొటోలు తీసి వెళ్లిపోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ గతంలో పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో ప ర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు.

పక్షుల విహార కేంద్రానికి ప్రయత్నం

తేలినీలాపురం మాదిరి తేలుకుంచిలో పక్షల విహార కేంద్రం నెలకొల్పేందుకు సుమారు రూ.పది లక్షల అంచనాతో గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. గ్రామంలో మొక్కలు నాటేందుకు గ్రామస్తు లు సహకరించడం లేదు. పక్షుల సంరక్షణకు చర్య లు తీసుకుంటున్నాం.

– ఎ.మురళీకృష్ణంనాయుడు,ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి

చెట్లపై సందడి చేస్తున్న విదేశీ విహంగాలు

అరకొర చెట్లు ఉండడంతో గుడ్లు పెట్టేందుకు పాట్లు

పట్టించుకోని అటవీ శాఖాధికారులు

గతంలో వచ్చిన వరుస తుఫాన్ల తీవ్రతకు ఇక్కడ చాలా చెట్లు నేలకొరిగాయి. 2018లో వచ్చిన తిత్లీ తుఫాన్‌కు వందలాది పక్షులు మత్యువాత పడ్డాయి. ఈ ఏడాది వందల సంఖ్యలో పక్షులు వస్తున్నాయి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

విడిది ఏదీ..? 1
1/2

విడిది ఏదీ..?

విడిది ఏదీ..? 2
2/2

విడిది ఏదీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement