
వేర్వేరు చోట్ల చోరీలు
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురంలో బంగారం షాపు నిర్వహిస్తున్న లెంక దిలీప్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ తన పిల్లలను చదువు నిమిత్తం శ్రీకాకుళంలోనూ ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో క్రమంలో గురువారం శ్రీకాకుళం వెళ్లిన దిలీప్ శుక్రవారం జె. ఆర్.పురంలో ఉన్న ఇంటికి వెళ్లగా తలుపుల తాళా లు పగులగొట్టి ఉండటం గమనించారు. వెంటనే జే.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించా రు. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి వెండి, బంగారం ఆభరణాలు దొంగిలించినట్లు గు ర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్లూస్ టీం సభ్యులు ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టెక్కలి శ్రీనివాసనగర్‌లో..
టెక్కలి రూరల్: స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాస ముంటున్న రిటైర్డ్ ఏపీఎస్‌పీ ఏఎస్‌ఐ నర్సింహమూర్తి ఇంట్లో చోరి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసనగర్ పిల్లలబంద చెరువు సమీపంలో నివాసముంటున్న నర్సింహమూర్తి నెలరోజుల క్రితం హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యజమాని నర్సింహమూర్తి హైదరాబాద్ నుంచి శనివారం వస్తున్నారని, ఆయన వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.