
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
భువనేశ్వర్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. సాగు కోసం అవసరమైన ఎరువుల విడుదలకు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియని శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీజను ఆరంభం కావడంతో ఎరువుల విక్రయం, పంపిణీలో అవకతవకలు, అవినీతి, అక్రమాలకు కళ్లెం వేసేందుకు అనుబంధ యంత్రాంగం ముందస్తుగా సిద్ధమైంది. ఈ ఏడాది సమగ్రంగా 58.50 లక్షల హెక్టార్ల భూమిలో ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రం ప్రణాళిక ఖరారు చేసింది. దీనిలో 34.94 లక్షల హెక్టార్లలో వరి, 23.56 లక్షల హెక్టార్లలో వరియేతర పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
భారత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ వ్యవసాయం కోసం సమగ్రంగా వివిధ గ్రేడ్‌ల 9.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించింది. దీనిలో ఇప్పటి వరకు రాష్ట్రానికి 7.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు విడుదల చేశారు. 3.65 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులు రైతులకు విక్రయించారు. వివిధ జిల్లాల్లో 4.24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, 23,589 మెట్రిక్ టన్నుల ఎరువులు త్వరలో వివిధ జిల్లాలకు చేరుకోవడానికి రవాణాలో ఉన్నాయి.
25 మంది డీలర్‌షిప్ లైసెన్సులు రద్దు
నల్ల బజారు, నకిలీ ఎరువుల వ్యాపారం నిరోధించేందుకు మార్క్‌ఫెడ్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్, నకిలీ ఎరువుల సరఫరా నివారించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రెవెన్యూ, పోలీసు శాఖలు జిల్లా, మండల స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఎరువుల రిటైల్, హోల్‌సేల్ పాయింట్లపై ఆకస్మిక తనిఖీల నిర్వహణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 1,993 రిటైల్ పాయింట్లను తనిఖీ చేసి 427 మంది రిటైలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ధారిత నిబంధనలను ఉల్లంఘించినందుకు 8 కేసులలో స్టాప్ సేల్ నోటీసులు జారీ చేయగా, 25 మంది డీలర్‌షిప్ లైసెన్సులను రద్దు చేశారు.
న్యూస్‌రీల్
58.50 లక్షల హెక్టార్ల భూమిలో ఖరీఫ్ సాగు
9.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయింపు
నేటి నుంచి ఖరీఫ్ వరి సేకరణ నమోదు

శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025

శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025