
ఐటీఈఆర్ ఆడిటోరియంలో కమ్మిన పొగలు
భువనేశ్వర్: నగరంలో పేరొందిన డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. అదృష్టవశాత్తు పొగలు కమ్మిన ఆడిటోరియం నుంచి బయటపడి విద్యార్థులు బతికి బట్ట కట్టగలిగారు. స్థానిక జగమొరా ప్రాంతంలోని ఎస్ ఓఏ డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్–రీసెర్చ్ (ఐటీఈఆర్) ఆడిటోరియం రెండో అంతస్తులో శుక్రవారం అకస్మాత్తుగా పొగలు కమ్మాయి. సకాలంలో అగ్ని మాపక దళం రంగంలోకి దిగి మంటలు నివారించడంతో ప్రమాద స్థలం నుంచి 65 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం తక్షణ ప్రతిస్పందనతో ఇది సాధ్యమైందని ఒడిశా అగ్నిమాపక శాఖ సీనియర్ అధికార వర్గాల సమాచారం. ఒక విద్యార్థి అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రికి తరలించారు.

ఐటీఈఆర్ ఆడిటోరియంలో కమ్మిన పొగలు