
ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు: రాహుల్
భువనేశ్వర్:
‘రాజ్యాంగాన్ని కాపాడదాం’ నినాదంతో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక బారముండా మైదానంలో భారీ బహిరంగ సభని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఆయనతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతు రాష్ట్రంలో ప్రజా దోపి డీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఒడిశా ను అదానీ నడిపిస్తున్నాడని ఆరోపించారు. భారతీ య జనతా పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్యాంగ విలువల్ని నిలువునా నీరు గార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నీరు, అడవి, భూమి గిరిజనులకే చెందుతాయి. ఇక్కడ గిరిజనులకు వారి భూమి పట్టాలు ఇవ్వడం లేదు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. ఇది కోటీశ్వరు ల ప్రభుత్వం. ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రభుత్వం’గా వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు అండ గా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. ముందస్తు సంప్రదింపులు లేకుండా గిరిజనులను బలవంతంగా తరలించి భూమి హక్కులను తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెసా అమలు అణగదొక్కి ఈ వర్గపు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. నిజమైన యాజమాన్యాన్ని పునరుద్ధరించడానికి పెసా చట్టం, గిరిజన బిల్లును కాంగ్రెస్ అమలు చేస్తుందని హామీ ఇచ్చింది. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ నిర్విరామంగా ఉద్యమిస్తుంది. ఎన్నికల సంఘం అధికార భారతీయ జనతా పార్టీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక కోటి మంది బూ టకపు ఓటర్ల ఆవిష్కరణ దీనికి నిలువెత్తు తార్కాణంగా పేర్కొన్నారు. బీహార్‌లో ఫలితాలను తారుమారు చేయడానికి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఎన్నికలను హైజాక్ చేయడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని సభాముఖంగా ప్రకటించారు.
మహిళలకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నా రు. రాష్ట్రంలో మహిళలకు భద్రత పూర్తిగా లోపించిందని, 40 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం కావడం దిగ్భ్రాంతికరమైన అంశంగా పేర్కొన్నారు. ఈ దుస్థితి పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెదవి కదపకుండా చోద్యం చూస్తుందన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 15 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నట్లు తాజా విశ్లేషణలు తేల్చడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
అదానీ కోసం శ్రీ జగన్నాథుని రథం నిలిపి వేశార ని ఆరోపించారు. ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు అని బహిరంగంగా దుయ్యబట్టారు. ఇటీవల ముగిసిన పూరీ శ్రీ జగన్నాథుని పవిత్ర రథయాత్ర సమ యంలో ఆచార, సంప్రదాయ విరుద్ధమైన సంఘటనలు చోటు చేసుకోవడం అపచారంగా పేర్కొన్నా రు. అదానీ కుటుంబానికి అనుకూలంగా రథాలను నిలిపి వేశారని ఆరోపించారు. ఇక్కడి ప్రభుత్వం ప్రజల కంటే కోటీశ్వరులకు సేవ చేస్తోందనేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు. పేదలు, గిరిజను లు, దళితులు, రైతులు మరియు కార్మికులకు అండ గా నిలిచేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్య సింహాలుగా అహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు.
సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది: మల్లికార్జున్ ఖర్గే
అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొత్తగా సాధించిది ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిన ప్రయజనాత్మక ఫలి తాలతో పబ్బం గడుపుకుంటోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటి (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగంలో పేర్కొన్నారు. భువనేశ్వర్‌ను రాజధానిగా అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆవిష్కరించారని, కాంగ్రెస్ ప్రభు త్వం ఒడిశాలో, కేంద్రంలో ఉన్న కాలంలో రాష్ట్రం పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య, రవాణా, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో స్థిరపరచిన వ్యవస్థతతో బీజేపీ చెలామణి అవుతోందన్నారు. రాష్ట్రంలో పారాదీప్ పోర్టు, రౌర్కెలా స్టీల్ ప్లాంట్, హిరాకుడ్ జలాశయం, నాల్కో, ఎన్‌టీపీసీ, మంచేశ్వర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, చిలికా నావల్ కోచ్‌లతదితర ప్రము ఖ వ్యవస్థలు కాంగ్రెస్ ఏర్పాటు చేసినవిగా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
గట్టి బందోబస్తు
రాహుల్ గాంధీ పర్యటన పురస్కరించుకుని గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. సమగ్రంగా 53 ప్లాటూ న్ల పోలీసు బలగాలతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బరముండా స్క్వేర్, కాంగ్రెస్ భవన్,మే ఫెయిర్ హోట ల్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 4 మంది డీసీపీ హోదా అధికారులు, 10 మంది అదనపు డీసీపీలు, 24 మంది ఏసీపీలు, 34 మంది ఇనస్పెక్టరు ఇంచార్జిలు, 70 మంది ఇతర సీనియర్ పోలీసు సిబ్బందిని మోహరించారు.

ఒడిశాను అదానీ నడిపిస్తున్నాడు: రాహుల్