
విషాదం
● వేర్వేరు చోట్ల ఇద్దరు బాలురు మృతి ● కాలువలో మునిగి ఒకరు.. నదిలో పడి మరొకరు మృత్యువాత
మల్కన్‌గిరి:
మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మందాపల్లి పంచాయతీ పులిమేట్ల గ్రామంలో గురువారం కాలువలో పడి ఎనిమిదేళ్ల బాలుడు గణేష్ మృతి చెందాడు. 4వ తరగతి చదువుతున్న గణేష్ స్కూల్ నుంచి వచ్చాక గ్రామ సమీపంలోని కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో తోటి బాలురు కేకలు వేశారు. స్థానిక రైతులు స్పందించి బాలుడ్ని బయటకు తీసి తండ్రికి సమాచారం అందించారు. వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగిస్తామని కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా తెలిపారు.
జయపురం: బొయిపరిగుడ సమితి పూజారిగుడ పంచాయతీ సనపావలిగుడలో గురువారం శుక్ర మఝి కుమారుడు ఐదేళ్ల హేమంత్ మఝి సమీప నదిలో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చాక ఇద్దరు పిల్లలతో స్నానం చేసేందుకు నదికి వెళ్లాడు. అక్కడ కాలు జారి నీటిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందించారు.

విషాదం