
గూడ్స్ రైలు ఢీకొని కార్మికుని మృతి
రాయగడ: గూడ్స్ రైలు ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక రైల్వే స్టేషన్ నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపై గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి సుందర్‌ఘడ్ జిల్లా దురుధేని పోలీస్ స్టేషన్ పరిధి అనల్‌జొర గ్రామానికి చెందిన చైతు కిసాన్ కుమారు దేవర్షి కిసాన్ (20)గా గుర్తించారు. గాయపడిన వారిలో సుందర్‌గఢ్‌కు చెందిన బబుల సాహ, రాయగడకు చెందిన సుశాంత్ దాస్‌లు ఉన్నారు. సంఘటన జరిగిన అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనులకు సంబంధించి దేవర్షి, బబుల, సుశాంత్‌లు పుష్ ట్రాలీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో ప్లాట్‌ఫాం వద్ద గల నాలుగు–అయిదు ట్రాక్ లైన్ మధ్య ట్రాలీని నిలిపారు. అదే సమయంలో గూడ్స్ ట్రైన్ ట్రాలీని ఢీకొంది. దీంతో ట్రాలీ వద్దగల దేవర్షి రైలు కిందపడి నుజ్జునుజ్జవ్వగా సుశాంత్, బబులలు గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన దేవర్షి కుటుంబానికి రైల్వే శాఖ తరఫున తగిన నష్టపరిహారం చెల్లిస్తారన్నారు. దేవర్షి, బబులలు ఓ రైల్వే కాంట్రాక్టరు వద్ద కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం.
మరో ఇద్దరికి గాయాలు

గూడ్స్ రైలు ఢీకొని కార్మికుని మృతి

గూడ్స్ రైలు ఢీకొని కార్మికుని మృతి

గూడ్స్ రైలు ఢీకొని కార్మికుని మృతి