
ఎమ్మెల్యే నియోజక వర్గంలో విపక్ష సభ్యుల ఆందోళన
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ నీలగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే సంతోష్ ఖటువా అరెస్టు డిమాండ్‌తో ఆందోళన క్రమంగా ఉద్ధృతం అవుతుంది. బిజూ జనతా దళ్ మహిళా నా యకురాలి పట్ల అసభ్య పదజాలంతో అవమానకర అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ. సిటింగ్ ఎమ్మెల్యే అరెస్టు నినాదంతో ఆయన సొంత నియోజక వర్గం నీలగిరి ప్రాంతంలో శుక్రవారం ఽనిరసన సభ నిర్వహించారు. పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ ఖటువా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బిజూ మహిళా జనతా దళ్ అధ్యక్షురాలు స్నేహంగిని చురియా, మాజీ మంత్రి సుదాం మ రాండి, జిల్లా అధ్యక్షులు జ్యోతి ప్రకాష్ పాణి గ్రాహి, ఎమ్మెల్యేలు అశ్విని కుమార్ పాత్రో, సంజీవ్ మల్లిక్, బిజూ యువ జనతాదళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బ్యోమకేష్ రాయ్ తదితర ప్రముఖ కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నియోజక వర్గంలో విపక్ష సభ్యుల ఆందోళన

ఎమ్మెల్యే నియోజక వర్గంలో విపక్ష సభ్యుల ఆందోళన