
రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఈనెల 15న కటక్ నగరంలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకుని కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయిలో భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు. డీజీపీతో పాటు భువనేశ్వర్, కటక్ జంట నగరాల పోలీస్ కమిషనర్, కటక్ జిల్లా మేజిస్ట్రేట్, కటక్ నగర డీసీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో రాయిఘర్ సమితిలో బెంగాలీ శరణార్థ గ్రామాల్లో బంగ్లాదేశ్ రోహింగ్యాల గుర్తింపు ప్రారంభమైంది. శుక్రవారం ఆ ప్రాంతంలో 59 మంది చొరబాటుదారులు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. వీరు 1971కి ముందు ఈ ప్రాంతానికి వచ్చినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. అందులో పది మందిని రాయిఘర్ పోలీస్ స్టేషన్ పిలిపించారు. వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీ లించారు. వీరు చాలా కాలంగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. కానీ పోలీసులు గుర్తించిన వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే కానీ రొహింగ్యాలు కాకపొవడం విశేషం.
వృద్ధులకు దుస్తులు పంపిణీ
రాయగడ: స్థానిక బ్యూటీపార్లర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుంబిగుడ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ మిశ్రో నేతృత్వంలో సంఘం సభ్యు లు వృద్ధాశ్రమంలో ఉంటున్న మహిళలకు చీర లు, పురుషులకు లుంగీ, టవల్‌లు అందజేశా రు. ప్రతీ ఏడాది ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంఘం సభ్యులు సంక్షేమ నిధికి విరాళాలు అందిస్తుంటారని, అందులో కొంతభాగంగా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శైలసూత సాహు, ఉపాధ్యక్షురాలు శివానీ పలక తదితరులు పాల్గొన్నారు.
భారీగా గంజాయి స్వాధీనం
కొరాపుట్: మూడు వేర్వేరు ఘటనల్లో 27 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పంధాలుంగ్ గ్రామ పంచాయతీ పరిధి జయంతిగిరి, చెటోడిపుట్ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో గంజాయితో పాటు 12 లీటర్ల దేశీ మద్యం పట్టుబడింది. దీంతో సిర్మే ఖొరా, జయరాం పంగి, బల్కి పంగి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ రథ్ ప్రకటించారు.
విప్ప పువ్వు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి గోరఖ్‌పూర్ గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వు బస్తాలను ఎకై ్సజ్ శాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గోరఖ్‌పూర్‌లో నివసిస్తున్న జేఎన్ సాహు అనే వ్యక్తికి చెందిన గోదాంలో విప్పపూవును నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ సిబ్బంది దాడులను నిర్వహించారు. దాడుల్లో ఎంత మొత్తం విప్పపువ్వు స్వాధీనం చేసుకున్నది తెలియజేయలేదు. నిందితుడు సాహును అదుపులోని తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష