
విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
పర్లాకిమిడి: ఒడిశా సాహిత్య అకాడమీ స్వర్ణోత్సవాలు పురస్కరించుకొని స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రబంధాలు, వక్తృత్వ, కవితాపఠనం, సాహిత్యం, జనలర్ నాలెడ్జిపై జిల్లాస్థాయి పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఉపాధ్యాయులు బినో ద్ చంద్ర జెన్నా, ఉపాంత ప్రహారి పూర్ణచంద్ర మహాపాత్రో, విశ్రాంత హెచ్‌ఎం శ్వేతా పట్నాయక్, బిచి త్రా నంద బెబర్తా, బినోదిని సైన్సు కళాశాల అధ్యక్షుడు మనోజ్ పట్నాయక్, మహిళా స్నాతక ఉన్నత విద్యాలయం అధ్యాపకులు భారతీ పాణిగ్రాహి, ఒడియా అధ్యాపకురాలు డా.చారుప్రభానాయక్, ఉపాధ్యాయులు శ్యాం సుందర గంతాయత్, శశిభూషన్ పట్నాయిక్ తదితరులు వ్యవహరించారు.