
దారికాచిన మృత్యువు..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కత్తమేట గ్రామం వద్ద మంగళవారం టమటా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి అటుగా వస్తున్న బైక్‌పై పడింది. బైక్‌పై వస్తున్న కానిస్టేబుల్ కృష్ణ పూజారి, భార్య రుక్మిణి పూజారి ట్రక్కు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కృష్ణ పూజారి అక్కడికక్కడే మృతి చెందారు. రుక్మిణికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి ఇద్దరినీ బయటకు తీశారు. కృష్ణ మృతి చెందినట్లు గుర్తించారు. ఆమెను వెంటనే మత్తాలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి రుక్మిణికి మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ట్రక్కు పడిపోయినట్లు కేసు నమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
భార్యకు తీవ్ర గాయాలు

దారికాచిన మృత్యువు..