
బాలియాత్ర నిర్వహణకు కమిటీ
జలుమూరు: రాష్ట్ర పండగగా బాలియాత్ర నిర్వహించేందుకు కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు యాత్ర కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. బాలియాత్ర నిర్వహణకు సంబంధించి ఆదివారం 20 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖలింగం ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ కటక్‌లో కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజుల పాటు యాత్ర జరగనుందని, శ్రీముఖలింగంలో ఏ తేదీన నిర్వహించాలనే విషయమై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యాత్ర విజయంవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.బలరాం, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామ పెద్దలు బి.వి.రమణ, తేజేశ్వరరావు, వేణు, చింతాడ వెంకటరావు, ఉపా ధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు.