
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాయగడ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దొహదపడతాయని సీఆర్ఫీఎఫ్ నాలుగో బెటాలియన్ కమాండెంట్ ఎం.ఎల్.నాయుడు గెడల అన్నారు. జిల్లాలోని మునిగుడ సమితి అంబొదల సమీపంలో గల పయిలాపడ గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లు నిర్వహించారు. రఘుబారి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 మొక్కలను నాటారు.
సీవా సంస్థ ఆధ్వర్యంలో..
కొరాపుట్: పర్యావరణ పరిరక్షణలో మరో భారీ కార్యక్రమం జరిగింది. ఆదివారం జయపూర్ సమీపంలోని గగనాపూర్ వద్ద ప్రభుత్వ భూమిలో పర్యవరణం కోసం గత 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న సోషల్ ఎన్విరానామెంటల్ ఎడ్యేకేషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) వన యజ్ఞం చేసింది. అటవీ శాఖ అందించిన వేయి మెక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తొలి రోజు భారీ ఎత్తున మొక్కలు నాటారు. గగనాపూర్ శివ మందిర పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. సీవాకి చెందిన జీవీ రెడ్డి, సుధాకర్ పట్నాయక్, వినాయక్ మహాపాత్రో, ప్రతాప్ పట్నాయక్, కిల్లంశెట్టి మెహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
జయపురంలో..
జయపురం: ‘ఒక మొక్క అమ్మ పేరున’ కార్యక్రమంలో జయపురం సమితి యు.పి.ఎస్ ప్రాంతీయ సాధనా కేంద్రంలో ఆదివారం వనమహోత్సం వారోత్సవాలు నిర్వహించారు. జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన కుమార్ ఆదేశాల మేరకు సి.ఆర్.సి.ఎస్ విజయలక్ష్మీ ౖస్వైయ్ పర్యవేక్షణలో మొక్కలు నాటారు. అబిజాన్‌లో హనాగుడ ప్రాథమిక పాఠశాల, గొడియ దొబాసాయి ప్రాథమిక పాఠశాల, పంజార హౌస్ కాలనీ పాఠశాల, సాంతరా సాహి పాఠశాల, ఎక్స్ బోర్డు మహమ్మదన్ పాఠశాల, సరస్వతీ బాల మందిరం, జయనగర్ ఆశ్రయం పాఠశాల, జయనగర్ ఉన్నత పాఠశాల, పాయిక వీధి పాఠశాల, సునారి సాహి ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల, జగదీష్ చంద్రనాయక్ ఉన్నత పాఠశాల, మునిసిపాలిటీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ రకాల పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ వరకు ఉంటుందని విజయలక్ష్మీ ౖస్వైయ్ తెలిపారు.
జయపురంలో..
జయపురం: జయపురం తెలుగు సంస్కృతిక సమితి నిర్వహిస్తున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాల ద్వారా ఆదివారం జయపురం సమితి గగణాపూర్ గ్రామ ప్రాంతంలో వన మహోత్సవం నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సోషియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా)సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 26 మంది ఎకో క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. వారితోపాటు పీఈటీ రీటా సామంత రాయ్, పాఠశాల ఉపాద్యాయులు ధనపతి భొత్ర, సోన, సిటీ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయక్ పాల్గొన్నారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల 1,000 మొక్కలు నాటినట్లు ఎకో క్లబ్ ఇన్‌చార్జి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయక్ తెలిపారు. రానున్న ఆదివారం కూడా వనమహోత్సవం నిర్వహిస్తామని, 2,500 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. జయపురం పాఠశాల నుంచి గగణాపూర్ గ్రామానికి ఎకో క్లబ్ విద్యార్థులు సైకిళ్లపై వెళ్లారు.

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ