
● పూరీలో బర్డ్‌ఫ్లూ కలకలం
భువనేశ్వర్: పూరీ జిల్లా డెలాంగ్ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బుధవారం డెలాంగు ప్రాంతంలోని కోళ్లఫారాల వద్ద వందలాది కోళ్లు చనిపోయాయి. ప్రధానంగా అంకులా, గొడిపుట్ మటియాపడా పరిరాల కోళ్ల ఫామ్ హౌస్‌లో కోళ్ల మరణాలు ఎక్కువగా సంభవించాయి. దీంతో కోళ్ళ పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు డెలాంగ్‌లో సుమారు 3 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించారు. ప్రత్యేక వైద్య ఈ బృందం వివిధ కోళ్ల ఫారాలు సందర్శించి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. పరిపాలన 3 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం ప్రభావిత ప్రాంతాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది.

● పూరీలో బర్డ్‌ఫ్లూ కలకలం

● పూరీలో బర్డ్‌ఫ్లూ కలకలం