కొరాపుట్: రాష్ట్ర పర్యాటక కార్యదర్శి, కొరాపుట్ జిల్లా నోడల్ అధికారి బల్వంత్ సింగ్ గుప్తేశ్వరాన్ని సందర్శించారు. సోమవారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి రామగిరి సమీపంలో గల దండకారణ్యంలో ఉన్న సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంలో పర్యటించారు. అక్కడ కోట్లాది రూపాయలతో నిర్మితమవుతున్న శబరి నది వద్ద ఘాట్లు, స్నానపు గదులు, విశ్రాంత స్థలాలు, రోడ్లు, ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలు కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ వివరించారు. అనంతరం నందపూర్ ప్రాంతంలో పురాతన జైన మత ప్రార్థనా స్థలాలను పరిశీలించారు. అనంతరం కొరాపుట్ కాపీ బోర్డు, లమ్తాపుట్‌లో భారీ తాగునీటి ప్రాజెక్ట్‌లలో పర్యటించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
గుప్తేశ్వరం సందర్శన