
మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టి
కొరాపుట్: మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టి ఉంటుందని సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీ కన్వర్ విశాల్ సింగ్ ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, మల్కన్‌గిరి, నువాపడ జిల్లాల్లో అప్రమత్తంగా ఉంటామన్నారు. అలాగే పోలీసులు నేర విచారణలో ముందడుగు వేస్తారన్నారు. ముఖ్యంగా గంజాయిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తక్షణం రేంజ్‌లో ఎస్పీతో సమావేశమైన తర్వాత పరిస్థితిపై సమీక్షిస్తామన్నారు. పదేళ్ల కిందట ఎస్పీగా పనిచేసిన చోటకు డీఐజీగా రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు కొరాపుట్ వాతావరణం ఎంతో ఇష్టమన్నారు.