
ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా సంధ్యా రాణి మాఝీ
భువనేశ్వర్: మయూర్‌భంజ్‌కు చెందిన సంధ్యారాణి మాఝి రాష్ట్ర రవాణా శాఖ ఆధీనంలో ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా చేరారు. ఆమె తొలి మహిళా ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా నియమితులు కావడం విశేషం. రక్షణ లేదా నౌకా దళంలో ఉద్యోగ జీవితం కొనసాగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సంధ్యారాణి మాఝి డ్రైవింగ్‌ను ప్రారంభించింది. ఆమె భర్త రామ్ రే మాఝీ (డ్రైవర్) ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుని అద్దె డ్రైవర్‌గా పదేళ్లకు పైగా పనిచేసింది. తర్వాత, ఆమె 2023లో జాజ్‌పూర్‌లోని ఛటియాలోని హెచ్‌ఎంవీ శిక్షణా కేంద్రంలో చేరింది. ఈ శిక్షణతో జపాన్‌లో పనిచేసే అవకాశం చేరువైన కుటుంబ బాధ్యతలతో స్వరాష్ట్రంలో ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు డ్రైవరుగా పని చేసి ఒక పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేసింది.

ప్రభుత్వ వాహన డ్రైవర్‌గా సంధ్యా రాణి మాఝీ