
కొరాపుట్‌లో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పర్యటన
కొరాపుట్: జిల్లాలో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే మంగళవారం పర్యటించారు. ఆమెకు జయపూర్‌లోని ఎయిర్ స్ట్రిఫ్‌లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిత్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల ఆడిటోరియంని సందర్శించారు. అక్కడ గిరిజనులకు ఉపాధి కల్పించే ఎస్సీ, ఎస్టీ జాతీయ విధానం ద్వారా ఎంస్‌ఎంఈ పథకాల అవగాహన సదస్సు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెనుకబడిన జిల్లాల్లో ఆదివాసీ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాలు వివరించారు. అనంతరం కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో, మత్స్య శాఖా మంత్రి గోకులా నంద నాయక్, పరిశ్రమల శాఖా మంత్రి సంపత్ స్వయ్, నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కొందమాల్ ఎంపీ సుకాంత్ పాణీగ్రాహి, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, రఘురాం మచ్చో, నర్సింగ్ బోత్ర, రుపుధర్ బోత్ర, పవిత్ర శాంత, కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్, నబరంగ్‌పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌లో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పర్యటన