
వృత్తి విద్యా కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
రాయగడ: విద్యార్థులు వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ బసంత కుమార్ ప్రధాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రపంచ యువ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ బీకే బసంత రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బిజయ్ కుమార్ సాహు, జిల్లా విద్యాశాఖ అధికారి రమచంద్ర నాహక్ తదితరులు పాల్గొన్నారు.

వృత్తి విద్యా కోర్సులతో ఉద్యోగ అవకాశాలు