
నిరుపేద యువతికి అండగా..
టెక్కలి : టెక్కలిలో సత్యసాయి నిత్యాన్నపూర్ణ సేవా కార్యక్రమంలో పనిచేస్తున్న నిరుపేద వితంతు కొమ్ము జ్యోతి కుమార్తె రవళి వివాహానికి సత్యసాయి సేవా సమితి సభ్యులు తమవంతు సహకారం అందజేశారు. బుధవారం రూ.50 వేల నగదు, పట్టుచీర, పుస్తెలతాడు, వివాహ సామగ్రి అందించారు. సమితి సభ్యులు అన్నపూర్ణ జగదీశ్వరరావు, నాగరాణి, టంకాల నాగరాజు తదితరులు రూ.10 వేలు, మిగిలిన దాతలు రూ.50 వేలు, బెలుసొంటి మధు పట్టుచీర, బంగారు శతమానం సమకూర్చారు. కార్యక్రమంలో యు.భాస్కరరావు, చంటి, ఆర్.ఆదినారాయణ, పి. సూర్యనారాయణ, కె.వేణుగోపాల్, ఎం.ఆదినారాయ ణ, ఎస్.రాములమ్మ, డిల్లేశ్వర్రావు, కోదండరావు, లక్ష్మణరావు, హెచ్.రాజశేఖర్, అప్పారావు, ఎం.తా తయ్య, కె.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.