
రిజర్వాయర్‌లో పడి వృద్ధుడు మృతి
కొరాపుట్: జోలాపుట్ రిజర్వాయర్‌లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోలాపుట్ రిజర్వాయర్ పరిధి రెంటా గ్రామ సమీపంలో ఉభ్న పర్ష ఘాట్ వద్ద జోడిపుట్ గ్రామానికి చెందిన సామ్ కిలో (60) స్నానానికి దిగి నీటిలో గల్లంతయ్యాడు. ఉదయం స్నానం కోసం వెళ్లిన సామ్ కిలో సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. సాయంత్రం సమయంలో రిజర్వాయర్ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. పాడువా ఎస్‌ఐ దీపక్ బారిక్ కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.