
చీకటి పడితే ట్రాఫిక్ వెతలు!
కొరాపుట్: చీకటి పడితే ట్రాఫిక్ వెతలు వెంటాడుతుండడంతో రాజానగర్ వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలో పురాతన రాజానగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుపోతుంది. రథాయాత్ర అనంతరం అక్కడ రఘునాధ మందిరం వద్ద రథం నిలుపుతారు. రథం విడి భాగాలు చేసేంత వరకు ఈ సమస్య ఉంటుంది. రథం చుట్టూ అనేక వాహనాలు పార్కింగ్ చేస్తారు. వాహనదారులు ఎంత మోర పెట్టుకున్న పార్కింగ్ నుంచి వాహనాలు తీయరు. దీంతో నిత్యం వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోతున్నాయి. ఈ ప్రాంతాన్ని కలుపుతూ ఐదు రోడ్లు ఉండడంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటుంది. సాయంత్రమైతే వాహనాలను విచ్చలవిడిగా నిలిపి వేస్తుండడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తక్షణం రాజానగర్ రథం వద్ద ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచి అక్రమ పార్కింగ్‌లపై చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చీకటి పడితే ట్రాఫిక్ వెతలు!

చీకటి పడితే ట్రాఫిక్ వెతలు!