
● సర్వత్రా ఆందోళనలు
కొరాపుట్: సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల వ్యాప్తంగా ఆగ్రహావేశాలతో కూడిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విద్యార్థిని చిత్రపటం ముందు ప్రముఖులు నివాళులర్పించారు. మాఘరో సంస్థ కన్వీనర్ కాదంబని త్రిపాఠి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. బందుగాం సమితిలో గురువారం బంద్ కోసం ముందస్తుగా కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాలలను లేఖలు అందజేశారు. బొయిపరిగుడ సమితి కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జయపూర్ మెయిన్ రోడ్డులో డీసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

● సర్వత్రా ఆందోళనలు