
నిందితులపై చర్యలు తీసుకోవాలి
కొరాపుట్: జర్నలిస్ట్ హత్యకు గురవడం పట్ల పాత్రికేయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్‌ని ఒడిశా యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ప్రతినిధులు బుధవారం కలిశారు. మల్కన్‌గిరి జిల్లా మొటు సమితి టైమ్స్ ఒడియా వెబ్ చానల్ జర్నలిస్ట్ సి.హెచ్.నరేష్‌ను హత్య చేసిన విషయం గుర్తు చేశారు. ఇంతవరకు జర్నలిస్ట్‌లకు బెదిరింపులు, దాడులు జరిగేవని, ఇప్పుడు స్థాయి పెంచి హత్యలు చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో నిందితులపై కఠిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్‌ల భద్రతకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం సభ్యులు రజేంద్ర గౌడ, రంజన్ దాస్, శశిధర్ రౌత్, సౌమ్య, తదితరులు ఉన్నారు.