
బురదలో దిగబడిన బస్సు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి నీలిగూడ గ్రామం ప్రధాన రహదారిలో మంగళవారం పోడియా నుంచి మల్కన్‌గిరికి వెళ్తున్న బస్సు బురదలో దిగబడింది. రెండు గంటలపాటు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు చేర్చారు. ఈ రహదారి పనులు గత రెండేళ్లుగా చేస్తున్నా పూర్తి కాలేదు. తరచూ ఈ రహదారిలో బైక్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వర్షం పడితే గోతుల్లో నీరుచేరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.