
గుప్తేశ్వరం ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
కొరాపుట్: గుప్తేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర మంగళవారం పరామర్శించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ వైద్య కళాశాలను సందర్శించారు. ఆదివారం సాయంత్రం గుప్తేశ్వరం సమీపంలో అగ్ని మాపక వాహనం బ్రేక్ ఫెయిలై బోల్‌భాం భక్తులపైకి దూసుకెళ్లడంతో ఒక బాలుడు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని తొలుత బోయిపరిగుడ సమితి కేంద్రం ఆస్పసత్రికి తర్వాత జయపూర్‌లోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం కొరాపుట్‌లోని వైద్య కళాశాలకి తరలించారు. ఈ ఘటనలో బాలుడు చనిపోగా.. అతని ఇద్దరు సోదరులకు కూడా గాయాయ్యాయి. ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేశారు.