
బోల్‌భం యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు
జయపురం: శ్రావణ మాసంలో పలు ప్రాంతాల నుంచి గుప్తేశ్వర్ శివ క్షేత్రానికి వేలాది మంది బోల్ భం భక్తులు వస్తారు. దీంతో గుప్తేశ్వర్‌లో బోల్‌భం భక్తులకు తగిన సౌకర్యాలు సమకూర్చే విషయమై చర్చిందేందుకు జయపురం సబ్‌కలెక్టర్ కార్యాలయ సభాగృహంలో శుక్రవారం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం శ్రావణ మాసం ప్రథమ సోమవారం నుంచి బోల్‌భం కావి డి దారులు వేలాది మంది వస్తారని, అందుచేత వారు ఎలా శాంతిగా, సురక్షతంగా బాబా గుప్తేశ్వర్ లో మహాశివుడుని దర్శించుకొనేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. అలాగే శివలింగంపై భక్తులు జలాభిషేకం చేసేందుకు తగి న ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించా రు. గుప్తేశ్వర్‌లో నీటి సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని సబ్‌కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే డయేరియా, అతిసార వ్యాధులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. రెండు రోజుల్లో గుప్తేశ్వర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నరు. గుప్తేశ్వర్‌లో పారి శుద్ధ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బోల్‌భం భక్తులు శివలింగాన్ని దర్శించుకొనేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సబ్‌కలెక్టర్ జయ పురం తహసీల్దార్ స్నిగ్ధ రాణి చౌధురి ఆదేశించారు. సమావేశంలో జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధి కారి పార్ధ కాశ్యప్, బొయిపరిగుడ ఇన్‌చార్జి బీడీవో శక్తి మహాపాత్రో, దేవదాయ విభాగ అధికారి చిత్తరంజన్ పట్నాయక్, బొయిపరిగుడ పోలీసు అధికా రి రక్ష్మీరంజన్ ప్రధాన్, అగ్నిమాపక విభాగ అధికారి సురేష్ బారిక్,రామగిరి పోలీసు పంటి అధికారి విష్ణు ప్రసాద్ మడకాని, రెవెన్యూ అధికారి హరిహర శతపతి, దిలీప్ ప్రధాన్లతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.