
పారదేశ్వర దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ
కొరాపుట్: పారదేశ్వర దేవాలయ నిర్మాణ కమిటీ సర్వ సభ్య సమావేశం సోమవారం జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్ సమీపంలో నిర్మితమవుతున్న మందిర ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు సుమారు రూ. 50 లక్షలు ఖర్చు అయినట్లు కమిటీ సభ్యులు వివరించారు. సుమారు మూడు అడుగుల ఎత్తు ఉండే స్పటిక లింగాన్ని పంజాబ్ నుంచి తెప్పించి ప్రతిష్టించాలని నిర్ణయించారు. శివ లింగం ఖర్చు సుమారు రూ. 30 లక్షలు అవుతుందని అంచనా వేశారు. దేవాలయ మిగతా నిర్మాణాలు పూర్తి చేయడానికి మరో రూ. 50 లక్షలు అవుతుందని కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ నిధులు వివిధ సంఘాలు, ప్రముఖులు, ప్రజల నుంచి చందాల ద్వారా పోగు చేసి సకాలంలో నిర్మాణం పూర్తి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. అలాగే సాయంత్రం నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తన అనుచరులతో వెళ్లి దేవాలయ నిర్మాణ పరిస్థితిని పరిశీలించారు.

పారదేశ్వర దేవాలయ నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ధ