
మానవత్వం మంటగలపొద్దు
రాయగడ: మానవత్వ విలువను మంట గలపవద్దని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సికిరపాయి పంచాయతీ పరిధిలోని కొంజొమాజొడి గ్రామంలో కొద్ది రోజుల కిందట లక సరక అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కొడియా సరకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వరుసకు పిన్ని కావడంతో ఆమెను వివాహం చేసుకోవడం గ్రామ సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన గ్రామస్తులు వారిని నాగలికి కట్టి పొలం దున్నించి హింసించారు. దీనిపై ఆదివారం సబ్ కలెక్టర్ జెన్న నేతృత్వంలో కల్యాణసింగుపూర్ బీడీఓ మనీషా దాస్, తహసీల్దార్ రంజన్ కుమార్ సెట్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్, ఏసీఎస్‌ఓ శుభాంశు భొయ్, కల్యాణసింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహరాతో ఏర్పడిన దర్యాప్తు కమిటీ గ్రామంలో పర్యటించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ పెద్దలతో మంతనాలు చేశారు. గ్రామ కట్టుబాట్లను వ్యతిరేకించే ఎవరికై నా ఇలాంటి దండనే ఉంటుందని స్థానికులు ఖరాఖండిగా చెప్పడంతో దర్యాప్తు బృందం అవాకై ్కంది. సబ్ కలెక్టర్ స్పందిస్తూ కట్టుబాట్లను పాటించాలని, కానీ ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఏదైనా తప్పు జరిగితే అందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వివరించారు. గ్రామస్తులను తాము చైతన్య పరిచామని, తాము గ్రామ కట్టుబాట్లను అనుసరించామే తప్ప ఎవరినీ హింసించలేదని గ్రామస్తులు తెలిపారని సబ్‌కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. కొంధొ కులం సమాజం అధ్యక్షుడు జొగేంద్ర వడక మాట్లాడుతూ గ్రామ కట్టుబాట్లను మీరాడని దండన విధించామని, వెలి వేయలేదని తెలిపారు. ఆచార వ్యవహారాలు ఎవరు అతిక్రమించినా శిక్ష తప్పదన్నారు. చట్టాన్ని మీరి తాము ఏ పనీ చేయలేదని తెలిపారు. ప్రేమికుడు లక సరక మాట్లాడుతూ తమను వెలి వేయలేదని, కక్ష సాధింపు ఏమీ లేదని, గ్రామ కట్టుబాట్ల ప్రకారం శిక్ష విధించారని తెలిపారు.

మానవత్వం మంటగలపొద్దు

మానవత్వం మంటగలపొద్దు

మానవత్వం మంటగలపొద్దు