
రైల్వే వంతెన మంజూరు చేయాలి
● నందపూర్ సమితి వాసుల డిమాండ్
కొరాపుట్: అవసరమున్న చోట రైల్వే వంతెన లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా సమీపంలో డర్లిపుట్ వైపు ప్రజలు రైల్వే వంతెన కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహుడా రథాయాత్ర రోజున రోడ్డు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద భక్తులు అధిక సంఖ్యలో కూర్చుని సేద తీరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో రైళ్లు వస్తే పరిస్థితి ఏమిటని ఈ ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రోజూ బాలలు ట్రాక్ దాటుకుంటూ పాఠశాలలకు వెళ్తుంటారు. అక్కడ ఉన్న స్థల పరిస్థితి ప్రకారం ఫుట్‌పాత్ వంతెన నిర్మించాలని ప్రజలు ఛిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైల్వే అధికారులు సర్వే చేసి వెళ్లారు. కానీ ఇంత వరకు వంతెన మంజూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రైల్వే వంతెన మంజూరు చేయాలి

రైల్వే వంతెన మంజూరు చేయాలి