
డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు
కొరాపుట్: డ్రైవర్ల సమ్మెతో రైతులకు నష్టం ఏర్పడింది. మంగళవారం ఒడిశా రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ల సంఘం ఆకస్మిక సమ్మెకి పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచే డ్రైవర్లు స్టీరింగులు వదిలి ఆందోళనకు దిగారు. దీంతో ఈ సమ్మె రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మంగళవారం వేకువ జామున 2,600 టన్నుల యూరియా ప్రత్యేక రైలు లో జయపూర్ స్టేషన్‌కి వచ్చింది. ఈ యూరియా లారీలు, వ్యాన్‌ల ద్వారా దుకాణాలకు,రైతులకు చేరాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైలు ర్యాక్ వద్దకి వాహనాలు రాలేదు. ప్రస్తుతం కొరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్‌పూర్ జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో మెక్క జొన్న పంట వేశారు. వారికి మెదటి దశ యూరియా తక్షణం అందాలి. కానీ డ్రైవర్ల నిరవధిక సమ్మెతో రైతుల తీవ్ర ఆవేదనకి గురయ్యారు.
ఇరు జిల్లాలో డ్రైవర్ల సమ్మె
కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రైవేట్ వాహన డ్రైవర్లు నిరవధిక సమ్మెకి దిగారు. దాంతో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కొరాపుట్, సిమిలిగుడ, జయపూర్, బొరిగుమ్మ, నబరంగ్‌పూర్ పట్టణాల్లో డ్రైవర్ల ఆందోళన శిబిరాలు నడుస్తున్నాయి. మరో వైపు బుధవారం భారత్ బంద్ నేపథ్యంలో మంగళ వారం ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అంతర్రాష్ట్ర బస్సులు కూడా నిలిచి పోయాయి.

డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు

డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు

డ్రైవర్ల సమ్మెతో నిలిచిన ఎరువుల గూడ్స్ రైలు