
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కొత్తూరు: మండలంలోని వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుడు శంకరరావు నిర్వహిస్తున్న పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు మృతుడు మిన్నారావు పకోడి, బజ్జీలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ వెళ్తుంటాడు. దీనిలో భాగంగా మృతుడు మిన్నారావు ఈనెల 5వ తేదీ రాత్రి శంకరావు పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లి పకోడి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇద్దరు మధ్యం వివాదం జరిగింది. మిన్నారావు గతంలో బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాకీ విషయంలో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో మిన్నారావు తలపై సుత్తితో తల వెనుకభాగంలో కొట్టడంతో పాటు చాకుతో పీకను కోసి చంపినట్లు సీఐ ఎండీ అమీర్ అలీ పాల్గొన్నారు