
కాంగ్రెస్‌కు పలువురు రాజీనామా
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంద్రా సమితి సభ్యులు, సర్పంచ్‌లు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా కుంద్రా సమితికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయపూర్ పట్టణంలోని సంగం కల్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ సమితి చైర్మన్ రాజేశ్వరి పరజాకి తాము అభివృద్ధి కోణంలో మద్దతు ఇచ్చామన్నారు. ఆమె భర్త సురేంద్ర పరజా, మరో కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్‌లు ఎన్నికై న సభ్యులకు విలువ ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తామంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదుగురు సర్పంచ్‌లు, ముగ్గురు సమితి సభ్యులు రాజీనామ చేశారు. కుంద్రాలో సమితి చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవలసి వస్తుంది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు టునా పట్నాయక్ మట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అని అన్నారు.