
దళిత, మైనారిటీలపై దాడులు అరికట్టాలి
కొరాపుట్: రాష్ట్రంలో దళిత, మైనారిటీ వర్గాల ప్రజలపై దాడులు అరికట్టాలని సర్వమత సమ్మేళనం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోను బుధవారం సర్వమతస్తులు కలిశారు. గంజాం జిల్లాలో దళిత యువకులకు శిరో మండనం చేసి వీధుల్లో ఊరేగించారని, మల్కన్‌గిరి జిల్లాలో మతం మారినందుకు క్రైస్తవ మతస్తుల ఇళ్లపై దాడులు చేశారని కలెక్టర్‌కు వివరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాలరాస్తూ అగ్రకుల మతోన్మాదులు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. అనంతరం కలక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల కుంటుంబాల సంఘం అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, క్రైస్తవ, ముస్లిం, ఆదివాసీ, హరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

దళిత, మైనారిటీలపై దాడులు అరికట్టాలి