
రూ.158 కోట్లతో అభివృద్ధి
కొరాపుట్: రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీటి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రబి నాయక్ రూ.158 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. నబరంగ్‌పూర్ జిల్లాలో మంత్రి పర్యటించారు. పపడాహండిలో స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.18.28 కోట్లతో జల జీవన్ మిషన్ తాగు నీటి సరఫరా ప్రాజెక్ట్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.62.64 కోట్ల విలువ గల 12 ప్రాజెక్ట్‌లు, మిషన్ శక్తి ద్వారా రూ.15 కోట్లతో 50 గ్రామ పంచాయతీలలో మహా సంఘ్ భవనాలు, 109 అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. జిల్లాకి చెందిన ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గోండో, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, నర్సింగ్ బోత్ర, కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.

రూ.158 కోట్లతో అభివృద్ధి