
30 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీస్‌స్టేషన్ పరిధి తాటిగూడ గ్రామం వద్ద శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బలిమెల పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి విచారించగా అతని వద్ద గంజాయి పట్టుబడింది. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి తాటిగూడ గ్రామానికి చెందిన రామ్ మడ్కమిగా గుర్తించారు. చిత్రకొండ సమితిలో గంజాయిని కొనుగోలు చేసి బలిమెలకు తరలిస్తూ పట్టుబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని ఐఐసీ దీరాజ్ పట్నాయక్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. రెండు లక్షలు ఉంటుందని చెప్పారు.
ఒకరి అరెస్టు