
దద్దరిల్లుతున్న బొలొంగా
సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025
● అపచారం
● నేడు సువర్ణ చక్ర పరిక్రమ
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు
నగదు : రూ. 7,19,515
బంగారం : 220 మిల్లీ గ్రాములు
వెండి : 80 గ్రాములు – భువనేశ్వర్/పూరీ
భువనేశ్వర్: పూరీ జిల్లాలో బాలికకు నిప్పు అంటించిన సంఘటనలో పోలీసులకు ఇంత వరకు ఎలాంటి ఆధారం లభించక తల్లడిల్లుతున్నారు. ఈ నిస్సహాయ పరిస్థితి ఆధారంగా విపక్ష బిజూ జనతా దళ్ ఆందోళనలతో విజృంభించింది. ఆదివారం బొలొంగా గ్రామం అటు దర్యాప్తు బృందాల సందర్శన, ఇటు విపక్షం ఆందోళనల హోరు మధ్య బిక్కు బిక్కుమంటున్నారు.
మరో 24 గంటల్లో ఆగంతకుల ఆచూకీ గుర్తించ లేకుంటే వీధికి ఎక్కుతామని విపక్ష బిజూ జనతా దళ్ అటు ప్రభుత్వానికి, ఇటు పోలీసులకు బాహాటంగా హెచ్చరించింది. ప్రభుత్వం పెదవి కదపకుండా పరిస్థితిని లోతుగా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా నైతికత దృష్ట్యా పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు భద్రత మధ్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుక్షణం తాజా పరిణామాల పట్ల దృష్టి సారించారు.
కొనసాగుతున్న విచారణ
ఈ సంఘటనపై విచారణ నిరవధికంగా కొనసాగిస్తున్నారు. సందిగ్ధ వ్యక్తుల్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. శనివారం రాత్రి తొలి దశలో 8 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మేరకు విడుదల చేశారు. తిరిగి ఆదివారం ఉదయం వీరందర్ని ఠాణాకు రప్పించి విచారణ కొనసాగించారు. వీరిలో బాధిత బాలిక బంధువులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆధారాలు, సాక్ష్యాలకు సంబంధించి ధ్రువీకరణ దృఢపడక పోవడంతో ఇంత వరకు అరెస్టుల ఘట్టం ఆరంభం కాలేదు. ఈ తటస్థ వైఖరి పట్ల విపక్ష బిజూ జనతా దళ్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. బొలంగా పోలీసు ఠాణా ముట్టడించి మరో 24 గంటల్లోగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయకుంటే జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆదివారం స్పష్టం చేసింది. బొలొంగాలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుంది.
న్యూస్‌రీల్

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా

దద్దరిల్లుతున్న బొలొంగా