
కొత్త కలెక్టర్ల నియామకం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలకు నూతన కలెక్టర్లు రానున్నారు. ప్రస్తుత కొరాపుట్ జిల్లా కలెక్టర్ వీ.కీర్తి వాసన్‌ను గంజాం జిల్లాకు బదిలీ చేసింది. 2018 బ్యాచ్‌కి చెందిన సుందర్‌ఘడ్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్‌ని కొరాపుట్ జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు. ఈయన స్వస్థలం మహారాష్ట్రలోని జలగాం జిల్లా. పేదరికం నుంచి వచ్చిన మనోజ్ పుణే యునివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తండ్రి ఉపాధ్యాయుడు. నబరంగ్‌పూర్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపత్రో సుందర్‌ఘడ్‌కి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో 2014 బ్యాచ్‌కి చెందిన డాక్టర్ మహేశ్వర్ స్వయ్ పంచాయతీరాజ్ డైరెక్టర్ హోదా నుంచి నబరంగపూర్ కలెక్టర్‌గా రానున్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయకుమార్‌దాస్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంసంక్షేమశాఖ అదనపు కార్యదర్శిగా పదోన్నతిపై రాజధానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గంజాం జిల్లా ఛత్రపురం జిల్లా పరిషత్ సి.డి.ఒ., ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుమితను గజపతి కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మధుమిత గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.
రాయగడ: రాయగడ జిల్లా కొత్త కలెక్టర్‌గా సి.అశుతొష్ కులకర్ణి నియమితులయ్యారు. రౌర్‌కళాలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన్ను రాయగడ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రాయగడ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఫరూల్ పట్వారి ఎస్‌ఎస్‌ఈపీడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గుణుపూర్ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ దీప్ కౌర్ సహాట కటక్ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు.

కొత్త కలెక్టర్ల నియామకం

కొత్త కలెక్టర్ల నియామకం

కొత్త కలెక్టర్ల నియామకం