
ఘనంగా నెక్కంటి జన్మదిన వేడుకలు
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, జిల్లా బీజేడీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు 73వ జన్మదిన వేడుకలు బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక తేజస్వీ సమీపంలోని బీజేడీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నెక్కంటి ప్రారంభిస్తూ ప్రసంగించారు. రక్తదానం మహాదానమని పేర్కొన్నారు. స్థానిక జిల్లా కేంద్రాసుపత్రి బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్, సిబ్బంది పరివేక్షణలో జరిగిన ఈ శిబిరంలో 75 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. నెక్కంటి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్కళాంధ్ర బ్రాహ్మణ సేవా సమాజం సభ్యులు నెక్కంటిని గజమాలతొ సత్కరించి ఆశీర్వదించారు. సమాజం అధ్యక్షుడు వేద పండితులు రేజేటి శ్రీనివాస్ శర్మ, కార్యదర్శి భళ్లమూడి నాగరాజు, భాస్కరాచార్యులు గణపతి శాస్త్రి, రేజేటి శ్రీరామ శర్మ, టీఎస్‌ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నెక్కంటి జన్మదిన వేడుకలు