
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
విధి నిర్వహణలో విద్యుత్ కార్మికుడి మృతి
కొరాపుట్: విధి నిర్వహణలో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం సమితి గొడకుంటా పంచాయతీ ముండాగుడ జంక్షన్ వద్ద విద్యుత్ స్తంభంపై పని చేస్తున్న సమయంలో బొరిగాం గ్రామానికి చెందిన రామ బోత్ర (36) కింద పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడని గుర్తించారు. వెంటనే ఈ సమాచారం డాబుగాం పోలీసులకు అందించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితునికి మూడేళ్లు జైలు శిక్ష
జయపురం: బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి మూడేళ్లు జైలు శిక్షను జయపురం పోస్కో స్పెషల్ కోర్టు విధించింది. 2017లో జిల్లా పొట్టంగి పోలీసు స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన అత్యాచారంపై కేసును విచారించిన పోస్కొ కోర్టు 10 మంది సాక్షులను విచారించింది. 8 రికార్డులను పరిశీలించింది. నిందితుడు బొడాపుట్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల దేబొ ఖబరకు మూడేళ్ల శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని పోస్కో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డాక్టర్ బి.గాయిత్రీదేవి బుధవారం వెల్లడించారు. 2017 అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలిక సమీప నదిలో దుస్తులు ఉతికి తిరిగి వస్తున్న సమయంలో దేబొ ఖబర నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడతుండగా హాహాకారాలు చేసింది. ఆమె ఆర్తనాదాలు విని బాలిక సోదరుడు అక్కడకు రావటంతో దేబొ అతడిని చూచి పరుగు తీశాడు. బాలిక జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు వివరించింది. వారు పొట్టంగి పోలీసు స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గురుదేవ్ కమ్రి, ఏఎస్‌ఐ అమినేష్ చంద్ర మాలి ఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు పంపారని, ఆ కేసుని విచారించి న్యాయాధికారి తీర్పు ఇచ్చారు.
డీజీపీని కలిసిన ట్రైనీ ఐపీఎస్‌లు
భువనేశ్వర్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇతర సీనియర్ పోలీసు అధికారులను 77వ బ్యాచ్‌కు చెందిన 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణార్థులు వివిధ అంశాలపై వివరంగా చర్చించారు. నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించి అద్భుతమైన సేవలను అందించాలని డీజీపీ సూచించారు.
దాడికి గురైన బాధితురాలిని ఇంటి నుంచి ఆస్పత్రికి
తరలిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్లో) నిందితుడు సత్యజిత్ సర్కార్
కొరాపుట్ :
రాష్ట్రంలో మరో యువతిపై అమాననీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితికి చెందిన కల్పనారాయ్ అనే యువతి జయపూర్ పట్టణంలో నర్సింగ్ విద్య చదువుతోంది. ఆమె స్వగ్రామానికి చెందిన సత్యజిత్ సర్కార్ జయపూర్ వచ్చి ప్రేమ పేరుతో యువతిని వేధించేవాడు. ఆమె తిరస్కరించడంతో ఈ నెల 13న జయపూర్‌లో నడిరోడ్డుపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు జయపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 15న పిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సత్యజిత్ సర్కార్‌ని అదుపులోకి కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌బుల్ సెక్షన్లు ఉండటంతో కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. గాయపడిన బాధిత యవతి రాయిఘర్‌లోని ఇంటికి వచ్చేసింది. ఇదే సమయంలో సత్యజిత్ కూడా స్వగ్రామానికి వచ్చాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధిత యువతి మనస్థాపానికి గురై ఎరువుల మందులు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబీకులు యువతిని రాయిఘర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సమీపంలోని కాంకేర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఛత్తీస్‌గఢ్ రాజధానిలోని ప్రధాన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరిశీలించి యువతి బతకడం కష్టమని చెప్పడంతో తిరిగి రాయిఘర్ తీసుకొని వచ్చి ఇంటిలో వైద్యం అందజేస్తున్నారు. మంగళవారం బాధిత కుటుంబం రాయిఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు..
ఇటివల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం సరిగ్గా స్పందిండం లేదన్న ఆరోపణల నేపథ్యంలో పాలకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఏఎస్పీ ఆదిత్యసేన్‌ను బాధితురాలి వద్దకు పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మెరుగైన వైద్యం కోసం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఆమె కిడ్నీ పని చేయడం లేదని ప్రకటించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రంగం లోనికి దిగి బాధితురాలిని భువనేశ్వర్ లోని ఎయిమ్స్‌కి తరలించమని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం రంగంలోనికి దిగింది.
న్యూస్‌రీల్
ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జయపూర్ పోలీసులు నిందితుడిపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపించింది. అందుకే ఫొటోలను వైరల్ చేశాడని వాపోయారు. విషయం తెలుసుకున్న మహిళా హక్కుల ఉద్యమకారిణి, మాఘరో సంస్థ నాయకురాలు కాదంబరి త్రిపాఠి రాయిఘర్ బయలుదేరారు. మరోవైపు అధికారులు రాయిఘర్ చేరుకుని బాధితురాలిని ఉమ్మర్‌కోట్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్నా త్రిపాఠీ, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మజ్జిలు బాధిత యువతిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే వారిని లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే భైఠాయించారు. అనంతరం అనుమతించడంతో బాధితురాలిని పరామర్శించారు.
ప్రేమను తిరస్కరించిందని
యువతిపై నడిరోడ్డుపై దాడికి
పాల్పడిన యువకుడు
పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
కక్షతో యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన నిందితుడు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి
ఆలస్యంగా వెలుగుచూసిన
ఘటన

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025