
ఎయిమ్స్‌కు బాధితురాలు తరలింపు
కొరాపుట్ : రాయ్‌ఘర్ బాధిత యువతిని రాష్ట్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం భువనేశ్వర్‌కు తరలించింది. మరోవైపు భాదిత కుటుంబం ఇచ్చి ఫిర్యాదు మేరకు రాయిఘర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సత్యజిత్ రాయ్ ఆమెని ప్రేమించమని వేధించేవాడని తెలిసింది. ఆమె మరొకరి ప్రేమతో ఉందని తెలిసి దాడికి పాల్పడినట్లు సమాచారం. దీనికితోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఫొటోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు జయపూర్ ఐఐసీ ఉలాస్ చంద్ర రౌత్, నర్సింగ్ హాస్టల్ సూపర్ వైజర్ చంద్రికా పాత్రోలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
గాయాలతో చూశా..
ఈ నెల 13న యువతి ఔటింగ్‌కి వెళ్లింది. రెండు గంటలైనా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేశాను. ఆమె తండ్రి ఫోన్ ఎత్తి బయట ఉన్నామని, తిరిగి వస్తామని చెప్పారు. రాత్రిపూట తండ్రితో కలిసి హాస్టల్‌కు వచ్చేటప్పటికే కంటి, ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆ రాత్రే తండ్రితో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.
– చంద్రికా పాత్రో,
నర్సింగ్ హాస్టల్ సూపర్‌వైజర్
అలా అనడం సరికాదు..
ఈ నెల 15న నిందితుడు సత్యజిత్ సర్కార్‌ను కోర్టులో హాజరుపరిచాం. మా వరకు అతనిని అదుపులోకి తీసుకోని కోర్టులో హాజరుపరచడం వరకు చేశాం. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోలేదనడం సరికాదు.
– ఉల్లాస్ చంద్ర రౌత్, జయపూర్ ఐఐసీ

ఎయిమ్స్‌కు బాధితురాలు తరలింపు

ఎయిమ్స్‌కు బాధితురాలు తరలింపు