కొండలరావు నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

కొండలరావు నేత్రాలు సజీవం

Jul 21 2025 5:19 AM | Updated on Jul 21 2025 5:19 AM

కొండలరావు నేత్రాలు సజీవం

కొండలరావు నేత్రాలు సజీవం

శ్రీకాకుళమ కల్చరల్‌: నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డి కొండలరావు(70) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారుడు వడ్డి పశుపతినాథ్‌, పిల్ల వైకుంఠరావులు శిల్లా మణికంఠ ద్వారా విషయం రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్‌ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్‌ ఇన్‌చార్జి సుజాత, నంది ఉమాశంకర్‌ల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందచేశారు. దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు.

బీజేపీ జిల్లా కమిటీ నియామకం

శ్రీకాకుళం న్యూకాలనీ: భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లాశాఖ నూతన కార్యవర్గం నియామకై ంది. ఈ మేరకు ఆదివారం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు జాబితా వెల్లడిచేశారు. ఉపాధ్యక్షులుగా పాలవలస వైకుంఠరావు (పలాస), వెల్పుల గోవిందరావు (ఆమదాలవలస), మంగి లక్ష్మిరెడ్డి (ఇచ్ఛాపురం), లెంక అప్పలనాయుడు (ఎచ్చెర్ల), తాడెల భూపతి (పాతపట్నం), నడుపూరి లక్ష్మినారాయణ (టెక్కలి), భైరి అప్పారావు (శ్రీకాకుళం), నారాయణశెట్టి కల్పన (ఎచ్చెర్ల), ప్రధాన కార్యదర్శులగా చింతు పాపారావు (నరసన్నపేట), పేడాడ సూరపునాయుడు (ఆమదాలవలస), కోశాధికారిగా వీకె ప్రసాద్‌ (ఇచ్ఛాపురం), సహాయక కార్యదర్శులగా వి.రఘురాములు, బి.రాజేశ్వరి, కె.దమయంతి, పి.చంద్రావతి, పి.కావ్య, పి.సూర్యనారాయణ, బి.వంశీ, జె.కుమారి. జిల్లా ఐటీసెల్‌ కన్వీనర్‌గా రావాడ పురుషోత్తం, జిల్లా సోషల్‌మీడియా కన్వీనర్‌ బడే తాతారావును నియమించారు. కాగా, పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించిన సీనియర్‌ నాయకులను విస్మరించడం పట్ల అనేకమంది పెదవివిరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement