
పరిశుభ్ర నగరంగా భువనేశ్వర్
భువనేశ్వర్: భువనేశ్వర్ జాతీయ స్థాయిలో 10 పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో నగరం 9వ ర్యాంక్‌ను సాధించింది. పట్టణ పరిశుభ్రత పట్ల నిబద్ధత రంగంలో గంజాం జిల్లాలో అసికా, చికిటి నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (ఎన్‌ఏసీ) వరుసగా 50,000, 20,000 లోపు జనాభా విభాగంలో స్వచ్ఛ్ సెహార్ అవార్డును సొంతం చేసుకున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాల్ని ప్రదానం చేశారు. రాష్ట్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో, సీనియర్ అధికారులు, పట్టణ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖను అభినందించారు. స్వచ్ఛ, సమృద్ధి ఒడిశా ఆవిష్కరణ కోసం నిరంతరం కృషి చేయాలని సూచించాచారు.