
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పరశురాం మజ్జి
కొరాపుట్: భారతీయ జనతా పార్టీలో అత్యున్నత జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ పరశురాం మజ్జి నియమితులయ్యారు. మంగళ వారం అందుకు తగ్గ ఆదేశాలను రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రకటించింది. పరశురాం 2000–09 ల మధ్య రెండు సార్లు నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. జాతీయ కౌన్సిల్ సభ్యుని హోదా లో పార్టీ జాతీయ అధ్యక్షుని ఏన్నికలలో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. పరశురాంను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.
జిల్లా సివిల్ సప్లై అధికారిగా మానస రంజన్
జయపురం: కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై నూతన అధికారిగా మానస రంజన్ మహాపాత్రో నియమితులయ్యారు. ఈయన మంగళవారం జయపురం జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మహాపాత్రో ఇంత వరకు జాజ్‌పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా పనిచేస్తూ కొరాపుట్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ కొరాపుట్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా ఉన్న ప్రదీప్ కుమార్ పండ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ప్రదీప్ కుమార్ పండను జాజ్‌పూర్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా రాష్ట్ర సివిల్ సప్లై విభాగం నియమించింది.
పేకాట శిబిరంపై దాడి
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి గురండి పంచాయతీ మధుసూదన్ పూర్ గ్రామంలో గత కొద్ది రోజులుగా జరుపుతున్న పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడుల్లో రూ.2,44,100లు నగదు స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్టు చేసినట్టు గురండి ఐఐసీ ఓం నారాయణ పాత్రో తెలియజేశారు.

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పరశురాం మజ్జి