
రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన
నిజమందిరానికి.. జగన్నాథుడు నిజ మందిరానికి చేరుకున్నాడు. పర్లాకిమిడిలో యాత్ర ముగిసింది. –8లోu
బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం సోమవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.6,86,982లు, బంగారం 3 గ్రాముల 600 మిల్లీగ్రాములు, వెండి 1 గ్రాము 100 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.
భువనేశ్వర్: అఖిల ఒడిశా ట్రక్, బస్సు డ్రైవర్ల మహా సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఆరంభమైంది. ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు, ట్రక్ యజమానుల సంఘం ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించింది. అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సమ్మె ప్రభావంతో మంగళవారం రవాణా రంగం పూర్తిగా స్తంభించిపోయింది. అవగాహన లేని ప్రయాణికులు పలు చోట్ల బస్ స్టాపుల్లో చిక్కుకున్నారు. బస్సు సేవల పునరుద్ధరణ కోసం నిరీక్షించడంలో నిరుత్సాహానికి గురయ్యారు. సరుకు రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. అఖిల ఒడిశా డ్రైవర్ల మహాసంఘ 6 ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు నడుం బిగించింది. వాటిలో డ్రైవర్ల సంక్షేమ బోర్డులో ఆటో డ్రైవర్లను చేర్చడం, 60 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు ఫించను భద్రత, ఎక్కడికక్కడ విశ్రాంతి గదులు, మరుగు దొడ్ల సౌకర్యాలు, ప్రతి 100 కిలో మీటర్ల పరిధిలో వాహనాల పార్కింగ్ స్థలాలు, డ్రైవర్ల భద్రతకు హామీపూర్వక చట్టాల అమలు, గనులు, పారిశ్రామిక ప్రాంతాలలో డ్రైవర్లకు ఉద్యోగాలు కల్పించడంలో 70 శాతం రిజర్వేషన్ సౌకర్యం, ఏటా సెప్టెంబర్ 1ని జాతీయ డ్రైవర్ల దినోత్సవంగా ప్రకటన ప్రధాన డిమాండ్లుగా చోటు చేసుకున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా సమ్మె పట్ల స్పందించారు. డ్రైవర్ల సంఘం ప్రతిపాదిత డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సంఘం ప్రతినిథి ప్రముఖుల్ని త్వరలో ఆహ్వానిస్తుందన్నారు. వీరి డిమాండ్లలో కొన్ని న్యాయ సమ్మతమైనవిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా ప్రతిష్టంభన తొలగించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ప్రకటించారు.
న్యూస్‌రీల్
ఒడిశా డ్రైవర్ మహాసంఘం రాష్ట్రవ్యాప్త సమ్మె
డ్రైవర్లు స్టీరింగ్ చోడొ ఆందోళన
రాయగడ: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రాయగడ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్టీరింగ్ చొడో ఆందోళన చేపట్టారు. స్థానిక సాయి ఇంటర్నేషనల్ కూడలిలో డ్రైవర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ బోర్డులో తమ పేర్లు నమోదు చేయాలని, సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.

రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన

రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన

రవాణా వ్యవస్థలో ప్రతిష్టంభన