
వైభవంగా వనమహోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఛలాన్‌గూఢ పంచాయతీలోని నర్సరీ వద్ద మంగళవారం వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీశాఖ డీఎఫ్‌వో సాయికిరణ డి.ఎన్ నేతృత్వంలో కార్యక్రమం జరగ్గ ముఖ్యఅతిథిగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మన హక్కు అన్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. నాటిన మొక్కలను సక్రమంగా సరంక్షించాలని వక్తలు కోరారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్రశభరో, ఛలాన్‌గూఢ సర్పంచ్ అరక్షత నాయక్, ఛలాన్‌గూఢ పాఠశాల విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో 200 మొక్కలు నాటారు.

వైభవంగా వనమహోత్సవం