
గురువులే సమాజ మార్గదర్శకులు
కొరాపుట్: సమాజానికి గురువులే మార్గదర్శకులని నిఖిల ఉత్కళ ప్రాథమిక ఉపాధ్యాయుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణి రంజన్ త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం జయపూర్ పట్టణంలో లేబర్ ఆఫీస్ జంక్షన్ వద్ద బీఈఓ కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల పదవీ విరమణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక విద్య తోనే సమాజానికి పునాదులు పడతాయన్నారు. వెనకబడిన కొరాపుట్ జిల్లాలో పాఠశాలలకు వెళ్లడానికి సరైన మార్గాలు లేనప్పటికీ ఉపాధ్యాయులు విధి నిర్వహణలో వెనకడుగు వేయడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన 10 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కొరాపుట్ జిల్లా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశి భూషణ్ దాస్, బీఈఓ చందన్ కుమార్ పట్నాయక్, ఉపాధ్యాయుల సంఘం జయపూర్ విభాగ అధ్యక్షురాలు భారతీ హోత్త, తదితరులు పాల్గొన్నారు.