
22 కిలోల గంజాయి స్వాధీనం
కొరాపుట్: అక్రమ గంజాయి రవాణా గుట్టురట్టయింది. జయపూర్ ఎకై ్సజ్ పోలీసులు ఆదివారం పాత్రోపుట్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో పెట్రోల్ బంక్ సమీపంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తూ గమనించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బస్తాలో 22 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు మధ్యప్రదేశ్‌కి చెందిన బోలే గో స్వామి, మకాద్‌సిగా గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి వారికి రిమాండ్ విధించంతో జైలుకు తరలించారు. రేంజ్ ఇన్‌స్పెక్టర్ శశికాంత్ దత్ దర్యాప్తు చేస్తున్నారు.